బిర్లా వైట బయో-షీల్డ్‌ పుట్టి

గోడలపై వేయండి, తెల్లదనం మరియు సురక్షత రెండిటిని పొందండి

Loading

బిర్లా వైట బయో-షీల్డ్‌ పుట్టి

గోడలపై వేయండి, తెల్లదనం మరియు సురక్షత రెండిటిని పొందండి
సమీక్ష
బిర్లా బయో-షీల్డ్ పుట్టి భారతదేశపు మొట్టమొదటి వైరల్ విరుద్ధ పుట్టి మరియు ప్రీమియమ్ నాణ్యత కల వైట్ సిమెంట్ ఆధారిత పాలిమర్‌ మోడిఫైడ్ పుట్టి, ఇది వైరల్‌ విరుద్ధ మరియు మైక్రోబయల్ విరుద్ధ గుణగణాలను కలిగి ఉంటుంది. ఇది సురక్షితమైన మరియు పరిశుభ్రమైన పుట్టీ ఉపరితలాన్ని మీ గోడలకు అత్యద్భుతమైన తెల్లదనంతో పాటుగా అందజేస్తుంది, టాప్‌ కోట్‌ ఎమల్షన్ల యొక్క పనితనాన్ని ఇనుమడింపజేయడానికి వీలుగా ఇలా చేస్తుంది, ఇది మీ గోడలకు క్రిముల నుండి సంరక్షణతో పాటుగా మార్బుల్ లాంటి ఫినిష్ ను కల్పిస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
క్రిముల సంరక్షణ మరియు సిల్వర్‌ అయాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్సెల్‌ పుట్టి
Silver Ion Technology
వైరల్‌ విరుద్ధం, బాక్టీరియా విరుద్ధం, ఫంగల్‌ విరుద్ధం మరియు పాచి విరుద్ధం
NABL ల్యాబ్ ద్వారా పరీక్షించబడినది
అనుప్రయోగాలు
  • లోపలి గోడలు
  • బయటి ఉపరితలాలు

టెక్ స్పెసిఫికేషన్
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు ప్రత్యక పరిధి
1 *వేసే ప్రదేశం (చదరపు మీటర్లు / కిగ్రా/ రెండు కోట్స్ ) 1.67-1.95 ఇన్-హౌస్
2 పాట్‌ లైఫ్‌ (గంటలు) 3.0-3.5 ఇన్-హౌస్
3 : టెన్సైల్‌ అడ్హెషన బలం @28 రోజులు (N/m2) ≥ 1.1 EN 1348
4 వాటర్‌ క్యాపిల్లరి అబసార్‌ప్షన్‌ (మిలీ) , ౩౦ నిమిషాలు @ 28రోజులు ≤ 0.60 కార్‌స్టెన్‌ ట్యూబ్
5 కంప్రెసివ్ బలం @28 రోజులు (N/m2) 3.5-7.5 EN 1015-11
6 బల్క్‌ డెన్సిటి (g/cm3) (g/cm2) 0.8-1.0 ఇన్-హౌస్
*ఈ వేల్యూ నున్నటి ఉపరితలాలపైన. అయితే, ఉపరితల టెక్చర్ ప్రకారం ఇది మారిపోవచ్చును
ముందస్తు జాగ్రత్తలు
  • బయో-షీల్డ్‌ పుట్టీని 45% స్వచ్ఛమైన తాగే నీటితో కలపాలి
  • బయో-షీల్డ్‌ పుట్టీని కలపడం చాలా ముఖ్యం, అందువల్ల నునుపుదనం మరియు కవరేజ్‌ పరంగా కోరుకున్న అత్యుత్తమ ఫలితాలను పొందడానికి వీలుగా చేతితో లేదా యాంత్రిక కలిపే పనిముట్టుతో సక్రమంగా మరియు క్షుణ్ణంగా కలపడానికి అధికంగా శ్రద్ధను కనపరచాలి.
  • మూడున్నర గంటలు ఉపయోగించేందుకు వీలయ్యేలా బయోషీల్డ్‌ మిశ్రమం కేవలం కావలసిన పరిమాణంలో సిద్ధం చేసుకోవాలి
బిర్లా బయో-షీల్డ్‌ పుట్టీని పిల్లలకు అందుబాటులో లేకుండా అట్టేపెట్టాలి
మింగితే హానిని కలిగిస్తుంది. శరీరం లోపలికి వెళితే, వెనువెంటనే వైద్య సంరక్షణను తీసుకోవాలి
చిరచిర పెంపొందితే లేదా చర్మంతో అలాగే ఉండిపోతే, వెనువెంటనే దానిని పుష్కలంగా నీళ్ళతో శుభ్రపరచాలి మరియు త్వరగా వైద్య సంరక్షణను తీసుకోవాలి.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా బయో-షీల్డ్ పుట్టి భారతదేశపు మొట్టమొదటి వైరల్‌ విరుద్ధ పుట్టి మరియు ప్రీమియమ్‌ నాణ్యత కల వైట్ సిమెంట్‌ ఆధారిత పాలిమర మోడిఫైడ పుట్టి, ఇది వైరల్‌ విరుద్ధ మరియు మైక్రోబయల్ విరుద్ధ గుణగణాలతో లభిస్తుంది. ఇది సురక్షితమైన మరియు పరిశుభ్రమైన పుట్టీ ఉపరితలాన్ని మీ గోడలకు అత్యద్భుతమైన తెల్లదనంతో పాటుగా అందజేస్తుంది, టాప్‌ కోట్‌ ఎమల్షన్ల యొక్క పనితనాన్ని ఇనుమడింపజేయడానికి వీలుగా ఇలా చేస్తుంది, ఇది మీ గోడలకు క్రిముల నుండి సంరక్షణతో పాటుగా మార్బుల్ లాంటి ఫినిష్ ను కల్పిస్తుంది.

వైట్‌ రెగ్యులర్‌ పుట్టి బేస్‌ కోట్‌ ను నిజంగానే అందజేస్తుంది, అదే సమయంలో బిర్లా వైట్ బయో-షీల్డ్‌ పుట్టి హెచ్చయిన కవరేజ్, అధిక తెల్లదనం, ప్రీమియమ్ ఫినిష్‌ అందజేస్తుంది మరియు ఇది వైరల్‌ విరుద్ధ మరియు మైక్రోబయల్ విరుద్ధ గుణగణాలను కలిగి ఉన్నది. అదనంగా, ప్రీ-వెట్టింగ్-ఫ్రీ గుణగణాన్ని కలిగి ఉన్నది, ఇది వైట్ సిమెంట్‌ ఆదారిత పుట్టీలో ఇలాంటి రకంలో మొట్టమొదటిది.

రెండు ఉత్పాదనలను ఉపయోగించే విధానం ఒకటే. రెగ్యులర్‌ పుట్టీలో, ప్రీ-వెట్టింగ్ అవసరం, బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీలో ప్రీ-వెట్టింగ్ అవసరం లేదు. సాధారణ పుట్టి మరియు బిర్లా వైట్‌ బయో-షీల్డ్‌ పుట్టీ రెండిటిలో పెయింట్‌ వేసే ముందు ప్రైమర్ పూయవలసిన అవసరం ఉండదు.

బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ యొక్క తెల్లదనాన్ని హంటర్ వైట్‌నెస్‌ స్కేలుపై (HW) పైన ప్రామాణికమైన రిఫరెన్స్‌ సరుకుతో రిఫ్లెక్టెన్స్‌ను పోలుస్తూ చేయడం జరుగుతుంది. బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ HW పై +94.5% స్కోరు చేస్తుంది, ఇది రెగ్యులర్‌ పుట్టీ యొక్క +93%తో పోల్చినప్పుడు.

లేదు. బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీకు ప్రీ-వెట్టింగ్ లేదా క్యూరింగ్ చేయవలసిన అవసరం ఉండదు. వాస్తవంగా, దాని అద్వితీయమైన మిశ్రమ కారణంగా, మీరు నీళ్ళను కూడా ఆదా చేయడంలో అది సహాయపడుతుంది.

బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ ఒక ప్రీమియమ్ నాణ్యత కల బేస్‌ కోట్. అందువల్ల కోరుకున్న షేడులలోనికి టింట్ చేసుకోవడానికి వీలుకాదు. అయితే, ఈ బేస్ కోట్‌ పైన ఉపయోగించబడిన టాప్‌కోట్‌ ను కోరుకున్న షేడులలోనికి టింట్‌ చేయవచ్చును.

రెగ్యులర్‌ పుట్టి ఆదర్శవంతమైన కవరేజ్‌ కు విరుద్ధంగా రెండు కోట్స్‌లో ఇది 1.67-1.95 చదరపు మీటర్లు/కిగ్రాను కవర్ చేస్తుంది , రెగ్యులర్‌ పుట్టి 1.48-1.76 చదరపు మీటర్లు/కిగ్రాని మాత్రమే కవర్‌ చేస్తుంది. అందువల్ల సగటు లాభం 10-12%.

బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీని చిట్టచివరి ఫినిష్‌ గా ఉపయోగించకూడదు. టాప్‌కోట్‌ గా 2-3 కోట్స్ చక్కటి నాణ్యమైన ఎమల్షన్ పెయింట్‌ను వేయమని మేము సిఫారసు చేస్తున్నాము.

ప్రస్తుతం, బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ 30 కిగ్రా ప్యాక్ సైజులో లభిస్తున్నది.

బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీని దానిని తయారు చేసిన తేదీ నుండి 9 నెలల లోపల ఉపయోగించుకోవాలని సిఫారసు చేయబడుతున్నది.

వర్షాకాలంలో ఈ ఉత్పాదనను బయటి గోడలపై వేయమని మేము సిఫారసు చేయడం లేదు .

బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీని వేసేటప్పుడు, గోడ ఉపరితలంపై వేలాడుతూ ఉండే అణువులు మరియు మురికి లేకుండా ఉన్నదని ముందుగా మీరు నిర్ధారించుకోవాలి. ఉపయోగించే ముందు బాగా కలపాలి మరియు దుమ్మును పీల్చకుండా ఉండడానికి గాగుల్స్ మరియు అనువైన మాస్కును ముక్కుపై ధరించాలి. కళ్ళలో పడితే, వెనువెంటనే కడుక్కోవాలని మరియు వైద్య సహాయం పొందాలని మేము సిఫారసు చేస్తున్నాము. చివరిగా, ఈ ఉత్పాదనను చల్లటి, పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వచేయాలి మరియు తప్పకుండా పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.

అవును, బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ గ్రీన్‌ -ప్రొ స్టాండర్డ్‌ అవసరాలను నెరవేరుస్తుంది మరియు గ్రీన్‌ ప్రొ సర్టిఫికేషన్‌ కు అర్హమవుతుంది.

CASC బ్యాకింగ్‌ (కస్టమర్‌ అప్లికేషన్‌ సపోర్ట్‌ సెల్) కొరకు శిక్షణ పొందిన మరియు అంకిత భావం కలిగిన సివిల్‌ ఇంజనీర్లను ఇండియా అంతటా బిర్లా వైట్‌ కలిగి ఉన్నది. ఈ ఇంజినీర్లు సైటు వద్ద సాంకేతిక మద్దతును మరియు సైటు వద్ద నమూనాలను అందజూపుతారు. సర్ఫేస్‌ ఫినిషింగ్ అప్లికేటర్స్‌ కు కూడా ప్రత్యేక శిక్షణ మరియు ఆధునిక పనిముట్ల వినియోగంలో కూడా శిక్షణ ఇస్తారు, దాంతో వారు నైపుణ్యతను పెంపొందించుకోవడానికి వీలుకలుగుతుంది మరియు బిర్లా వైట్‌ను ఉపయోగించడంలో నిపుణులు అవగలరు.

ప్రస్తుతానికి అన్‌లైన్‌ పేమెంటుకు ఆప్షన్‌ లేదు. ప్రస్తుతానికి మా ఉత్పాదనలను వేటిని మేము నేరుగా డెలివరీ చేయడం లేదు. మా స్టాకిస్ట్‌ నెట్‌ వర్క్‌ ద్వారా మాత్రమే వాటిని రిటెయిల్‌గా అమ్మడం జరుగుతున్నది. అయితే, బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీని వేయడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టరు అవసరం ఉంటుంది. అందువల్ల మా అధీకృత రిటెయిలర్ / స్టాకిస్ట్‌ నుండి మా ఉత్పాదనలను కొనుగోలు చేయమని మేము సిఫారసు చేస్తున్నాము, వారు శిక్షణ పొందిన మరియు నైపుణ్యత కలిగిన కాంట్రాక్టరును సంప్రదించడంలో మీకు సహాయపడగలరు.

99.9% వైరస్ తగ్గినట్లుగా పరీక్ష సర్టిఫికెట్లు సూచించాయి. పాజిటివ్‌ –సెన్స్‌ సింగిల్‌ స్ట్రాండెడ్‌ RNA వైరస్ గురించి పరీక్ష చేయబడింది, ఈ వైరస్ ఒక వర్గంగా కోవిడ్ - 19 కు దగ్గరగా ఉంటుంది. ప్రచురింపబడిన శాస్త్రీయ దస్తావేజులు మరియు నివేదికలు అందుబాటులో ఉన్నాయి, తయారుచేయడంలో ఉపయోగించబడుతున్న సిల్వర్‌ అయాన్ టెక్నాలజీ పలు వైరసులకు విరుద్ధంగా గాఢంగా ప్రభావవంతమయినదని చెప్పడానికి మద్దతును ఇస్తున్నాయి, అయితే, ప్రస్తుతానికి కోవిడ్ - 19 కొరకు పరీక్షించవలసిన ఉన్న పదార్ధాలు కొరకు నిర్దిష్టమైన పరీక్ష ఏది అందుబాటులో లేదు. అందువల్ల, కోవిడ్ - 19 కు విరుద్ధంగా ఉపయోగించవచ్చనే క్లెయిము చేసే స్థితిలో బిర్లా వైట్‌ బయో షీల్డ్‌ పుట్టీ లేదు.

ఉత్పాదన ఆయుస్సు ఉన్నంతకాలం సిల్వర్‌ అయాన్‌ అణువులు ప్రభావాన్ని చూపుతాయి, కారణం అవి ఉపరితల మ్యాట్రిక్స్‌ సిస్టములో పొదిగి ఉంటాయి కాబట్టి. ఉపరితలం రసాయనిక పరంగా మరియు భౌతికంగా దెబ్బతింటేతప్ప, ఉత్పాదన పనితనపు ప్రభావాలు తగ్గిపోవు.

అవును, ఈ ఉత్పాదన థెర్మోస్టేబుల్‌. ఈ ఉపరితలంపై చేసే చికిత్స తొలగించబడలేనిది మరియు గాలిలో తేమకి, తేమకు లేదా సూర్యకాంతికి, చివరికి దానిపై వేసిన పేయింట్‌ వైరల్ -విరుద్ధ / బాక్టీరియా విరుద్ధ గుణగణాలను ప్రభావితం చేయదు. అయితే, రసాయనికపరమైన లేదా భౌతిక చికిత్స ద్వారా ఉపరితలానికి ఏదైనా నిర్మాణ పరంగా దెబ్బతగిలితే, ఉత్పాదన గుణగణాలు ప్రభావితం కావచ్చును.

అవును, ఈ వైరల్‌ విరుద్ధ ఉత్పాదన అదనపు బాక్టీరియా విరుద్ధ మరియు ఫంగల్ విరుద్ధ గుణగణాలను కలిగి ఉన్నది.

అవును, ఈ వైరల్‌ విరుద్ధ ఉత్పాదన భవనం లోపలి వాడుకకు పూర్తిగా సురక్షితమైనది

అవును, తాకితే మనుషులకు ఇది పూర్తిగా సురక్షితమైనది

లేదు, ప్రైమింగ్‌ మరియు పెయింటింగ్‌ కోట్‌ కు ప్రతిక్రియను చూపదు.

ప్రఖ్యాతి గాంచిన NABL ఆమోదించిన ల్యాబ్‌ ద్వారా పరీక్షించబడిన స్వచ్ఛమైన సిల్వర్‌ అయాన్‌ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఈ ఉత్పాదన ఉన్నది. బిర్లా వైట్‌ ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రీమియమ్‌ నాణ్యత బయో-షీల్డ్ పుట్టి, ఇందులో వైరల్ విరుద్ధ, బాక్టీరియా విరుద్ధ, పాచిని ప్రతిఘటించే గుణాలను కలిగి ఉన్నది మరియు ఫంగస్ ఎదుగుదలను అడ్డుకుంటుంది మరియు ఈ పుట్టి బేస్ కోట్‌ అధికంగా సంగ్రహించగల శక్తి ఉన్న సిమెంట్‌ సబ్‌స్టేట్ర్ల యొక్క సఛిద్రతను (పోరోసిటి)ని కవర్ చేయడంలో సహాయపడుతుంది. నిర్మాణ పనులలో సురక్షితమైన మరియు పరిశుభ్రమైన పుట్టీ ఉపరితలాన్ని ఇది కల్పిస్తుంది, దీనితో పాటుగా మీ గోడలకు టాప్‌కోట్‌ ఎమల్షన్ల పనితాన్ని హెచ్చు చేయడానికి వీలుగా అత్యంత తెల్లదనాన్ని జోడిస్తుంది, దీంతో మీ గోడలకు మార్బుల్‌ లాంటి ఫినిష్‌ సమకూరుతుంది.

ప్రైమర్ లేయరుకు మరియు ఆపై పెయింట్‌ లేయరుకు వ్యాప్తి చెందడం ద్వారా సిల్వర్ చేరుతుంది, అందువల్ల ప్రైమర్ మరియు పెయింట్‌ ఉపరితలానికి >99% చర్యను చేబడుతుంది.

పర్యావరణంలో సిల్వరు నష్టపోవడం నిదానంగా మరియు కనీసంగా జరుగుతుంది. పర్యావరణ పరిస్థితులపై మరియు ఉపరితల పరస్పరజోక్యాలపై నష్టం ఆధారపడి ఉంటుంది. పుట్టీని పలు రకాలుగా ఉపయోగించిన గతంలోని అనుభవాలను మరియు పుట్టీలో ఉండే తగినన్ని సిల్వర్ అయాన్స్‌ ని పరిగణలోనికి తీసుకుని, దీని సామర్ధ్యత కనీసంగా 4 నుండి 5 సంవత్సరాలు ఉంటుందని మేము సిఫారసు చేస్తున్నాము.

లేదు, బిర్లా వైట్‌ బయో-షీల్డ్‌ పుట్టి పూర్తిగా సురక్షితమైనది మరియు ఎలాంటి ఆరోగ్య సంబంధిత హానికరమైన పరిస్థితులు ఉండవు.

అవును, ఉత్పాదన యొక్క మిగిలిన ఇతర గుణగణాలు అన్నీ వర్తించినట్లుగా అట్టేపెట్టబడతాయి.

బిర్లా వైట్ బయో-షీల్డ్ పుట్టీ ఇండియాలోని మొట్టమొదటి యాంటీ-వైరల్ పుట్టీవే కాక అతి శ్రేష్ఠమైన నాణ్యతగల వైట్ సిమెంట్-ఆధారిత పాలిమర్ మాడిఫైడ్ (పరివర్తిత) పుట్టీ కూడా. ఇది యాంటీ-వైరల్ ఇంకా యాంటీ-మైక్రోబియల్ గుణాలగలది. ఇది టాప్‌కోట్ ఎమల్షన్స్ పని తీరుని మెరుగుపరచి మీ గోడలకి మార్బుల్-లాంటి ఫినిష్ ఇంకా క్రిముల నుంచి రక్షణ ఇచ్చేందుకు మీ గోడలకి అత్యుత్తమమైన తెల్లదనంతో పాటూ ఒక సురక్షితమైన, స్వాస్థ్యకరమైన ఉపరితలాన్ని ఇస్తుంది.

బిర్లా వైట్ బయో-షీల్డ్ పుట్టీ ధర 30 కేజీల ప్యాక్‌కి రూ. 1395/-.

బిర్లా వైట్ బయో-షీల్డ్ పుట్టీ సిల్వర్ ఐయాన్ (Ag+) టెక్నాలజీపై ఆధారితమైనది. బయో-షీల్డ్ పుట్టీ గ్రామ్-పాజిటివ్ ఇంకా గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియాకి కూడా యాంటీ-మైక్రోబియల్ కార్యసాధకత గలది. బ్యాక్టీరియా / వైరస్ బయో-షీల్డ్ పుట్టీ ఉపరితలాన్ని తాకినప్పుడల్లా, ఉపరితలం దగ్గర సిల్వర్ ఐయాన్స్ విడుదల అయ్యి బ్యాక్టీరియా / వైరస్‌ని ఇంకా ఫంగై / ఆల్గేని చంపే / నిష్ర్పభావంగా చేసే యాంటీ-మైక్రోబియల్ / యాంటీ-వైరల్ గుణాన్ని అందిస్తాయి. ఈ యాంటీ-మైక్రోబియల్ గుణం సిల్వర్ ఐయాన్స్ (Ag+) కి ఉంటుంది. సిల్వర్ ఐయాన్స్ సూక్ష్మజీవాణవులపై గురి పెట్టి / దాడి చేసి, వాటిని అనేక విధాల క్రియల ద్వారా ముట్టడిస్తాయి / చీలుస్తాయి. సిల్వర్ ఐయాన్స్ బ్యాక్టీరియా కణపటలంలోకి చొచ్చుకుపోయి, ఆ పొరలోని బ్యాక్టీరియా కణాలలోకి పదార్థాలను అందించే ప్రోటీన్స్‌తో ఏకం అయిపోతాయి. సిల్వర్ ఐయాన్స్ కణాలలోకి కూడా చేరి, డీఎన్‌ఏతో ఏకం అయ్యి కణాల విభజనని ప్రతిబంధిస్తాయి. అంతే కాక, సిల్వర్ ఐయాన్స్ బ్యాక్టీరియా శ్వాస మండలాన్ని ప్రతిబంధించి (ఆక్సిజెన్‌ని తగ్గించి) తద్వారా కణాని శక్తి ఉత్పత్తిని నాశనం చేసేస్తాయి. చివరకి, బ్యాక్టీరియా కణపటలాలు చిట్లిపోయి / పిగిలిపోయి బ్యాక్టీరియా నాశనం / నిష్ర్పభావంగా అయిపోతాయి.