బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్

తెల్లదనం సాటిలేనిది, ఏళ్ళ తరబడీ మన్నేది కావాలంటే మీకు అత్యుత్తమమైన సిమెంట్ వాష్.

Loading

బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్

తెల్లదనం సాటిలేనిది, ఏళ్ళ తరబడీ మన్నేది కావాలంటే మీకు అత్యుత్తమమైన సిమెంట్ వాష్.
సమీక్ష
బిర్లా వైట్ “ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌”, ఈ వర్గంలో అసామాన్యమైన మన్నిక, శ్రేష్ఠమైన మెరుపు ఇంకా తక్కువ ఖర్చుతో మంచి వాల్ ఫినిష్‌ని ఇచ్చే మొట్టమొదటి సిమెంట్ వాష్. ఇది మామూలు లైమ్ వాష్ కన్నా ఎంతో మేలైనదే కాక చాలా ఎక్కువ కాలం కూడా మన్నుతుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
Excel putty with Germ protection & Silver Ion Technology
Silver Ion Technology
Anti-viral, Anti-bacterial, Anti-fungal and Anti-algae
విశేషతలు
  • సూక్ష్మరంధ్రాలనూ/సూచీరంధ్రాలనూ, సన్నని బీటలనూ, పగుళ్ళనూ నింపుతుంది
  • శ్రేష్ఠమైన తెల్లని ఫినిష్
  • నున్నని మ్యాట్ ఫినిష్
  • చెమ్మగా/తడిగా ఉన్న ఉపరితలాలకు పూయవచ్చు
ప్రయోజనాలు
  • పొరలు లేదా పెచ్చులు ఊడకపోవడమే కాక, కడుక్కుపోదు కూడా
  • 3 సంవత్సరాల మన్నిక అందిస్తుంది
  • ఉపరితలానికి అదనమైన బలం చేకూరుస్తుంది
అనుప్రయోగాలు
  • లోపలి గోడలకు
  • బయటి గోడలకు

టెక్ స్పెసిఫికేషన్
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు టెస్ట్ విధానం
1 *కవరేజ్ (చ.అ./కేజీ/ రెండు కోట్స్) [శ్రేష్ఠమైన నున్నని ఉపరితలంపై] 38-42 ఇన్ హౌస్
2 పాట్ లైఫ్ (గంటలు) 1.5-2.0 ఇన్ హౌస్
3 ఆరేందుకు సమయం @ 25±2 ºC
-టచ్ డ్రై
-హార్డ్ డ్రై
Max 1 hrs.
Min. 6 hrs.
ఇన్ హౌస్
ఇన్ హౌస్
4 వీఓసీ (మిగ్రా/కేజీ) శూన్యం ASTM 6886
5 బల్క్ డెన్సిటీ (గ్రా/సెమీ3) 0.90-1.0 ఇన్ హౌస్
*ఈ విలువ నున్నని ఉపరితలంపై; అయితే ఇది ఉపరితలం టెక్స్‌చర్‌ని బట్టి మారవచ్చు.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ అనేది ఒక నీటితో పల్చబడే వైట్ సిమెంట్ ఆధారిత ఉత్పత్తి. ఇది ప్లాస్టర్ చేయబడిన కొత్త లోపలి/బయటి గోడల ఉపరితలాలకూ, కాంక్రీట్/ఆర్‌సీసీ ఉపరితలాలకూ ఉత్తమమైనది.

బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ హెచ్చైన మన్నికగలదనీ, శ్రేష్ఠమైన తెల్లదనాన్నిఇస్తుందనీ, తక్కువ ఖర్చుతో మంచి వాల్ ఫినిష్ ఇస్తుందనీ మూడు వాగ్దానాలతో వస్తుంది. ఇది నున్నని మ్యాట్ ఫినిష్ ఇచ్చేందుకు సన్నని బీటలనీ, పగుళ్ళనీ కూడా నింపుతుంది. బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ ఈ వర్గంలో ఇటువంటి మొట్టమొదటి ఉత్పత్తి. ఇది మామూలు సిమెంట్ వాష్ ఇంకా లైమ్ వాష్ కన్నా చాలా ఎక్కువ కాలం మన్నడమే కాక అడుగుతట్టు మీద ఎంతో శ్రేష్ఠమైన, మరింత తెల్లని ఫినిష్ ఇస్తుంది.

అవును, బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌కి నీటితో కనీసం 3-5 రోజుల క్యూరింగ్ కావలసి ఉంటుంది (వాతావరణ స్థితిని బట్టి రోజుకి 2-3 సార్లు).

నున్నని మ్యాట్ ఫినిష్ పొందేందుకు కనీసం 2/3 కోట్లు బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ పూస్తే మేలు. కానీ దీన్ని అండర్‌కోట్‌గా ఉపయోగిస్తే, ఒకే ఒక కోట్ సరిపడుతుంది.

అన్నిటికంటే ముందుగా అడుగుతలం నుంచి ధళి, జిడ్డు, మురికి మొదలైనవాటిని పోగొట్టాలి. బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌ని పూసే ముందు, గోడ/ఉపరితలం నుంచి ఎమరీ/ స్యాండ్‌పేపర్, బ్లేడ్ లేదా వైర్ బ్రష్ మొదలైనవాటిని ఉపయోగించి వదులుగా అంటుకొని ఉన్న పదార్థాలతో పాటూ, మురికి, ధూళి, నూనె మొదలైనవాటిని అన్నిటినీ తొలగించండి. బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌ని పూసే ముందు మరింత మెరుగైన పనిసౌలభ్యం, కవరేజ్ పొందడం ఇంకా ఉపరితలంతో మరింత బలమైన బంధం ఏర్పడటం కోసం గోడ/ఉపరితలాన్ని ముందుగా తడపటం ముఖ్యమైన చర్య.

నిజానికి, అది సిఫారసు చేయబడదు. కానీ మీరు దాన్ని ఏ పెయింట్ చేయబడి ఉన్న ఉపరితలం మీదైనా పూయవలసి వస్తే, మీరు వదులుగా/గట్టిగా అంటుకుని ఉన్న పాత పదార్థాలన్నిటినీ పూర్తిగా తొలగించి ఆ ఉపరితలాన్ని బాగా శుభ్రంగా సిద్ధం చేయండి. దాని వల్ల బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌కి అడుగుతట్టుతో బలమైన బంధం ఏర్పడుతుంది.

కలిపేందుకు నిష్పత్తి (1:1.2): 1 కేజీ బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌ని మెల్లగా 120% శుభ్రమైన నీటితో కలిపి (1 కేజీ బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ + 1200 మిలీ నీరు) సజాతీయమైన స్లర్రీని తయారు చేయండి.

సజాతీయమైన చిక్కదనం పొందడానికి ఉత్తమంగా మెకానికల్ స్టర్రర్‌తో (3-5 నిమిషాల పాటు)/ చేత్తో 10-12 నిమిషాల పాటు కలపాలి. తయారు చేయబడిన స్లర్రీని 1.5-2 గంటల్లోగా ఉపయోగించాలి.

బాగా కలిపిన తరవాత బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌ని తడిపిన/తడి గోడ/ఉపరితలం మీద పెయింటింగ్ బ్రష్‌తో (4 లేదా 5 ఇంచ్‌లు)/సరైన రోలర్‌తో ఏకరీతిగా పూయండి. అతి శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి, ఉపరితలాన్ని సరిగా క్యూర్ చేసేందుకు ప్రతి కోటూ 6-8 గంటల పాటు ఆరిన తరవాత ఉపరితలం మీద నీళ్ళు కొట్టి తడపండి. రెండవ కోట్ పూసే ముందు ఉపరితలాన్ని 24 గంటల పాటు లేదా కనీసం రాత్రి తెల్లవార్లూ ఆరనివ్వండి.

బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్‌ని పూసేటప్పుడు, మీరు గోడ మీదితట్టు ముందే తడిపి ఉండేలా నిశ్చితపరచాలి. మిశ్రమం పూసే ముందే గట్టి పడిపోకుండా ఉండేలా నిశ్చితపరచేందుకు మిశ్రమాన్ని 2 గంటల్లోగా వాడగలిగేంత పరిమితమైన మొత్తంలో మాత్రమే కలపాలి. హెచ్చైన ఉష్ణోగ్రతలో పూయకుండా ఉండటం మంచిది, ఎందుకంటే సిమెంట్ మరింత త్వరగా గట్టి పడి ఉపరితలం మీద బ్రష్ జాడలు వస్తాయి. రెండు బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ కోట్ల మధ్య 24 గంటల ఎడం ఉంచడం మంచిదని సిఫారసు చేయబడుతుంది.

కవరేజ్ అడుగుతట్టు/ఉపరితలం స్వభావం ఇంకా టెక్‌స్చర్‌ని బట్టి ఉంటుంది. అడుగుతట్టు సూక్ష్మరంధ్రాలుగలది అయితే, తక్కువగా ఉంటుంది, లేదంటే మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా, 1 కేజీ బిర్లా వైట్ ఎవర్-వైట్ సిమెంట్ వాష్ చక్కటి నున్నని అడుగుతట్టు/ ఉపరితలం మీద రెండు కోట్లకి 3.5 చెదరపు మీటర్ల నుంచి 3.9 చెదరపు మీటర్ల వరకు ఇస్తుంది.

The market price of 25kg Birla White Ever-White Cement Wash is ₹800.