ఎక్స్‌టోకేర్ ప్రైమర్

బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్ 7x * అతుక్కునే స్వభావంతో వస్తుంది కాబట్టి మీ గోడల నుండి పెయింట్ పెచ్చులు రాలిపోదు!

* Certified by NABL accredited laboratory

Loading

ఎక్స్‌టోకేర్ ప్రైమర్

బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్ 7x * అతుక్కునే స్వభావంతో వస్తుంది కాబట్టి మీ గోడల నుండి పెయింట్ పెచ్చులు రాలిపోదు!

* Certified by NABL accredited laboratory
సమీక్ష
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ అనేది ఒక వైట్ సిమెంట్ ఆధారితమైన, పాలిమర్-మాడిఫైడ్, ఎక్స్‌టీరియర్ వాల్ ప్రైమర్. ఇది మార్కెట్‌లో లభించే ఏ యాక్రిలిక్ వాల్ ప్రైమర్ కన్నా 7X* ఎక్కువ అఢీషన్ అందిస్తుంది. ఇది మీ గోడ టాప్‌కోట్ పొరలు ఊడకుండా అడ్డగించి, మీ గోడలని ఏళ్ళ తరబడీ కాపాడుతుంది. ఆ అదనపు రక్షక పొరతో పాటూ ఈ ఉత్పత్తి, పెయింట్ అసలైన వర్ణఛాయలను బయట పెట్టేందుకు సాధ్యమైనంత శ్రేష్ఠమైన అపారదర్శకతనీ, తెల్లదనాన్నీ అందిస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
హంటర్ స్కేల్‌పై అతి హెచ్చెైన తెల్లదనం (94.5%)
పెయింట్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది
ఎక్స్‌టీరియర్ పెయింట్స్ అన్నిటికీ అనుకూలమైనది
విశేషతలు
 • ఈ వర్గంలో అతి శ్రేష్ఠమైన అపారదర్శకత ఇంకా తెల్లదనం
 • యాంటీ-కార్బనేషన్ గుణంగలది
 • ఇతర ప్రైమర్ల కన్నా 7x* ఎక్కువ అఢీషన్ అందిస్తుంది
 • వీఓసీలు (వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్) లేనిది
 • యాంటీ-ఆల్కలీ
 • ఈకో-ఫ్రెండ్లీ (పర్యావరణానుకూలమైనది)
 • హెచ్చెైన మన్నికగలది
ప్రయోజనాలు
 • ఆర్‌సీసీ కట్టడాన్ని క్షయం నుంచి కాపాడుతుంది
 • టాప్‌కోట్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది
 • పూసేందుకు సులువైనది
 • ఎత్తైన కట్టడాలకు పూసేందుకు లాభకరమైనది
 • చెమ్మగా/తడిగా ఉన్న ఉపరితలాలకు పూయవచ్చు
 • యూవీ ఇంకా వాతావరణం ప్రభావాన్ని తట్టుకుంటుంది
అనుప్రయోగాలు
 • బయటి గోడలకు
 • ఆర్‌సీసీ నిర్మాణాలకు/ప్లాస్టర్ ఉపరితలాలకు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

టెక్నికల్ స్పెసిఫికేషన్:
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు ప్రత్యక పరిధి
1 *కవరేజ్ (చె.అ./కేజీ/కోట్) [శ్రేష్ఠమైన నున్నని ఉపరితలంపై] 90-110 ఇన్ హౌస్
2 పాట్ లైఫ్ (గంటలు) 3.0-3.5 ఇన్ హౌస్
3 తెల్లదనం (%, హెచ్‌డబ్ల్యూ) +94.5% ఇన్ హౌస్
4 ఆరేందుకు సమయం @ 25±2ºC
- టచ్ డ్రై
- హార్డ్ డ్రై
అత్యధికంగా 1 గం.
కనీసం 6 గం.
ఇన్ హౌస్
ఇన్ హౌస్
5 వీఓసీ (మిగ్రా/కేజీ) శూన్యం ఏఎస్‌టీఎమ్ 6886
6 బల్క్ డెన్సిటీ (గ్రా/సెమీ3) 0.80-0.90 ఇన్ హౌస్
* ఈ విలువ నున్నని ఉపరితలంపై; అయితే ఇది ఉపరితలం టెక్స్‌చర్‌ని బట్టిమారవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు:
 • పూసేటప్పుడు దయచేసి అడుగుతట్టు తేమగా/తడిగా ఉండేలా నిశ్చితపరచండి.
 • వేసవి కాలంలో ఉదయం 10 గంటల ముందు లేదా సాయంత్రం 5 గంటల తరవాత పూయడం మేలు.
 • మూడున్నర గంటలలోగా ఉపయోగించడానికి అవసరమైనంత మిశ్రమాన్ని మాత్రమే కలపాలి.
 • మింగితే హానికరమైనది. కడుపులోకి వెళ్ళినట్టైతే, వెంటనే వైద్యునితో సంప్రదించండి.
 • చర్మానికి మంట పుట్టినా, తగ్గకుండా అలాగే ఉన్నా, చర్మాన్ని వెంటనే ఎక్కువ నీళ్ళతో కడగండి. వెంటనే వైద్యునితో సంప్రదించండి.
చెయ్యవలసినవి:
 • గోడ ఉపరితలం మురికిలేకుండా ఉండేలా నిర్ధారించుకోండి.
 • మెరుగైన బాండింగ్ & కవరేజ్ కొరకు గోడని/ఉపరితలాన్ని ముందుగా తడిపి తీరాలి.
 • ఉపయోగించేముందు బాగా కలపండి.
 • చల్లగా, పొడిగా ఉన్న చోట చేర్చిపెట్టండి.
 • పూసేటప్పుడు సంరక్షక గాగుల్స్ పెట్టుకోండి. కళ్ళల్లోకి పడినట్టైతే వెంటనే ఎక్కువ నీళ్ళతో బాగా కడిగి, వైద్యునితో సంప్రదించండి.
 • స్యాండింగ్ ఇంకా ఉపరితలాన్ని సిద్ధం చేసేటప్పుడు, ధూళిని పీల్చకుండా ఉండేందుకు సరైన నోస్ మాస్క్ ఉపయోగించవలసిందని సిఫారసు చేయబడుతోంది.
చెయకూడనివి:
 • నిర్దేశించినదాని కంటే ఎక్కువ నీరు పొయ్యకండి.
 • మధ్యాహ్న సమయం అప్పుడు పూయకండి (నలువైపులా ఉన్న ఉష్ణోగ్రత 35-40 ºC కన్నా ఎక్కువ).
 • ఎక్స్‌టోకేర్ ప్రైమర్ (సింగిల్‌కోట్) పూసిన ఉపరితలాన్ని టాప్‌కోట్ పూయకుండా ఎక్కువ సమయం వరకు అలాగే ఉంచేయకండి (ఒక నెల కన్నా ఎక్కువ కాదు).
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All
మీ పెయింట్ ఎక్కువ కాలం మన్నేందుకు, మీ గోడలని పెయింట్ చేసే ముందు వాటిని సిద్ధం చేయడం చాలా అవసరం. వాల్ ప్రైమర్ అనేది పెయింట్ ఉపరితలానికి బాగా అంటుకునేందుకు తోడ్పడి, పెయింట్ మన్నికని పెంచి, పెయింట్ చేసిన తరవాత కూడా ఉపరితలాన్ని కాపాడుతుంది. వాల్ ప్రైమర్లు గోడ ఉపరితలంపైన ఉన్న రంధ్రాలనీ, బీటలనీ పూడ్చి గోడ ఉపరితలం పెచ్చులు ఊడకుండా, పసుపుపచ్చగా అవ్వకుండా, పొరలు ఊడకుండా ఇంకా బొబ్బలు ఎక్కకుండా అడ్డగిస్తాయి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ అనేది, పెయింట్ చేసే ముందు బయటి గోడలపై ఉపయోగించబడే వైట్ సిమెంట్ ఆధారితమైన, పాలిమర్-మాడిఫైడ్, నీటితో పల్చబడే అండర్‌కోట్ వాల్ ప్రైమర్.
ఇది నీటితో పల్చబడే ఉత్పత్తి కాబట్టి, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌ని చెమ్మగా ఉన్న /తడిగా ఉన్న ఉపరితలాలపై పూయవచ్చు. అందువల్ల దీన్ని పూతడం మార్కెట్‌లోని ఇతర వాల్ ప్రైమర్ల కన్నా సులువు అవుతుంది. ఇది సిమెంట్-ప్లాస్టర్డ్/ఆర్‌సీసీ ఉపరితలాలపై పూసేందుకు ఉత్తమమైనది. అంతే కాక ఇతర ప్రైమర్లతో పోలిస్తే, దీన్ని వాడితే ఖర్చు తక్కువగా ఉంటుందు. ఇది మీ గోడకి 7X* ఎక్కువ అఢీషన్ అందించి, పెయింట్ పొరలు ఊడటం తగ్గిస్తుంది.
యాక్రిలిక్ ప్రైమర్‌లాగ కాకుండా, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌కి పూసిన తరవాత క్యూరింగ్ అవసరం లేకపోవడమే కాక, దీన్ని పూయడం కూడా సులువు. ఇది ఎత్తైన గోడలకి బాగా పని చేస్తుంది. అలాగే ఈ వర్గంలో అతి శ్రేష్ఠమైన తెల్లదనాన్నీ, హ్చ్చైన అపారదర్శకతనీ అందిస్తుంది. ఈ ప్రైమర్ టాప్‌కోట్‌కి మార్కెట్లో ఉన్న ఏ ప్రైమర్ కన్నా 7X* ఎక్కువ అఢీషన్ అందిస్తుంది కాబట్టి, టాప్‌కోట్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది. అంతే కాక, ఇది ఆర్‌సీసీ కట్టడాన్ని క్షయం నుంచి కాపాడుతుంది. ఇది ప్రధాన జాతీయ లెబారెటరీల ద్వారా దీని అతి శ్రేష్ఠమైన గుణాల వల్ల ధృవీకరించబడింది.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ పూసే ముందు గోడని సిద్ధం చెయ్యడానికి, మీరు ఉపరితలం నుంచి వదులుగా అంటుకొని ఉన్న పదార్థాలతో పాటూ, మురికి, ధూళి, నూనె మొదలైనవాటిని అన్నిటినీ తొలగించాలి. అందుకు మీరు స్యాండ్‌పేపర్, బ్లేడ్ లేదా వైర్ బ్రష్‌ని ఉపయోగించవచ్చు. మళ్ళీ పెయింట్ పూసే ముందు, ఉపరితలం నున్నగా అయ్యేందుకు దాన్ని 180 లేదా 220 ఎమరీ పేపర్‌తో రుద్దాలి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్‌ని కలిపేందుకు సిఫారసు చేయబడిన నిష్పత్తి 1 కేజీ ఉత్పత్తికి 1100 మిలీ నీరు.
స్లర్రీని తయారు చేసేందుకు, ఉత్తమంగా మెకానికల్ స్టర్రర్‌తో 5 నిమిషాల పాటు కలపాలి. చేత్తో తయారు చేస్తే, 10-12 నిమిషాల పాటు బాగా కలపాలి. చివరకి ఒక క్రీమీ చిక్కదనంగల స్లర్రీ తయారు అవ్వాలి. స్లర్రీని తయారు చేసిన తరవాత, మెరుగైన పాలిమర్ డిస్పర్షన్ పొందేందుకు 5 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి. దాన్ని తప్పకుండా 3-3.5 గంటల్లోగా ఉపయోగించాలి.
స్లర్రీని బాగా కలపడం అయిన తరవాత, ఒక బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్ కోట్‌ని ఉపరితలం మీద సమానంగా పూయండి. మీరు ఆ పని పెయింటింగ్ బ్రష్ (0.1016 లేదా 0.127 మీటర్లు) సహాయంతో లేదా రోలర్‌తో చెయ్యొచ్చు. టాప్‌కోట్ పూసే ముందు బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ మొదటి కోట్‌ని కనీసం 2-3 గంటల పాటు ఆరనివ్వండి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌ని పూసేటప్పుడు, మీరు గోడ మీదితట్టు ముందే తడిపి ఉండేలా నిశ్చితపరచాలి. స్లరీని సిఫారసు చేయబడిన నిష్పత్తి ప్రకారం కలిపి, దాన్ని తయారు చేసిన 3-3.5 గంటల్లోగా ఉపయోగించాలి. అడుగుతట్టు తడిగా ఉండాలి. ఉపరితలాన్ని ఎక్కువ సమయం వరకు టాప్‌కోట్ పూయకుండా ఉంచకూడదు. మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి సంరక్షక గాగుల్స్ పెట్టుకొని, సరైన నోస్ మాస్క్‌లు వేసుకోండి. చివరకి, ఈ ఉత్త్తిని చల్లగా, పొడిగా ఉన్న చోట చేర్చిపెట్టి, పిల్లలకి అందకుండా ఉంచాలి.
పోదు. గోడలలోని చెమ్మని ముందు పోగొట్టవలసి ఉంటుంది. మీరు మీ గోడలని మళ్ళీ పెయింట్ చేసే ముందు, జలనిరోధక కెమికల్స్‌తో చెమ్మని అరికట్టే సేవలు అందించే నిపుణుల సహాయం తీసుకోమని సిఫారసు చేస్తాం. ఆ విధంగా, మీరు ఆ సమస్య మళ్ళీ రాకుండా నిశ్చితపరచగలరు.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ 10 కేజీల ఇంకా 30 కేజీల బక్కెట్ ప్యాక్ బ్యాగలో లభిస్తుంది.
అవును, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ గ్రీన్‌ప్రో ప్రమాణ ఆవశ్యతలకు సరితూగడమే కాక, గ్రీన్‌ప్రో ధృవీకరణకి కూడా యోగ్యతగలది.
వీఓసీలు (వాలటైల్ ఆర్గానిక్ కంటెంట్) అస్థిరమైన, కార్బన్-గల మిశ్రిత పదార్థాలు. అవి గాలిని కలుషితం చేసి శ్వాస సమస్యలు, తల నొప్పులు, చర్మం మంట పుట్టడం, కళ్ళల్లోంచి నీరు కారడం ఇంకా వికారంతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యలను పుట్టిస్తాయి. కొన్ని వీఓసీలు క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు ఇంకా కాలేయం చెడిపోవడానికి కూడా కారణం కావచ్చు. అంచేత, వారి చుట్టూ ఉన్న నిర్మాణ సామగ్రిలో వీఓసీలు లేకుండా ఉండాలని సిఫారసు చేయబడింది.
ప్రస్తుతం ఆన్‌లైన్ కొనుగోలు సౌకర్యం లేదు. అంతే కాక, మేం ఇంకా మా ఉత్పత్తులు ఏవీ కూడా నేరుగా ఇంటికి చేర్చడం లేదు. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రీటెయిల్లో అమ్మబడుతున్నాయి. అయినా, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్‌ని పూయడానికి సుశిక్షితుడైన కాంట్య్రాక్టర్ కావాలి. అంచేత, మేం, మా అధికృత రీటెయిలర్/స్టాకిస్ట్ నుంచే మా ఉత్పత్తిని కొనుగోలు చేయవలసిందిగా సిఫారసు చేస్తున్నాం. వాళ్ళు మీకు నిపుణతగల సుశిక్షితుడైన కాంట్య్రాక్టర్‌ని కనుక్కొనేందుకు కూడా తోడ్పడతారు. మీరు మా ప్రొడక్ట్ క్యాటలాగ్‌ని ఇండియామార్ట్‌లో చూడవచ్చు.
బిర్లా వైట్‌కి ఇండియా అంతటా సీఏఎస్‌సీ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) సహాయం కోసం సుశిక్షితులైన, నిబద్ధతగల సివిల్ ఇంజినీర్ల బృందం ఉంది. ఈ సివిల్ ఇంజినీర్లు స్థలంలోనే సాంకేతిక సహాయం ఇంకా స్థలంలోనే నమూనా సేకరణ సేవలు అందిస్తారు. వీళ్ళు ఉపరితలాలకు మెరుగు పూత పూసే వారికి ప్రత్యేకమైన శిక్షణ పద్ధతులు ఇంకా ఆధునిక ఉపకరణాలతో శిక్షణ ఇచ్చి, వారికి నైపుణ్యం పెంచుకొని, నిపుణులైన బిర్లా వైట్ అప్లికేటర్స్ అయ్యేందుకు తోడ్పడతారు.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు