Buy on Amazon
Enquire Now

Loading

టైల్-లింక్ టైల్ గ్రౌట్
బిర్లా వైట్ టైల్-లింక్ అనేది మేలైన నీటి నిరోధక శక్తితో పాటూ నాచు నిరోధక గుణాలు కూడా కలిగి ఉన్న ఒక హెచ్చైన నాణ్యత గల, అడ్వాన్స్డ్‌ పాలిమర్-మాడిఫైడ్, హెచ్చైన పని తీరు గల గ్రౌట్. ఇది గ్లేజ్డ్ టైల్స్, మొజెయిక్, విట్రిఫైడ్ ఇంకా ఫుల్లీ విట్రిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్, ఇండస్ట్రియల్ టైల్స్, గ్రెనైట్స్, మార్బుల్స్ ఇంకా ఇతర న్యాచురల్ స్టోన్స్ మొదలైనవాటి గ్రౌటింగ్ చేసేందుకు తయారు చేయబడినది. మామూలు సిమెంట్ గ్రౌట్ తో పోలిస్తే బిర్లా వైట్ టైల్-లింక్ మరింత హెచ్చైన శక్తితో పాటూ మరింత నీటి ఇంకా మరక నిరోధక శక్తి గలది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
అతి హెచ్చైన నీటి నిరోధకశక్తి
మన్నిక గలది, వంగే గుణం గలది
టైల్ సంధుల మధ్యన 1-6 ఎమ్ఎమ్ల ఎడం
నిర్ణీతమైన అనువర్తనం/వివరణం
ఫీచర్లు మరియు ప్రయోజనాలు
  • ఉపయోగించేందుకు సిద్ధమైనది: సైట్ దగ్గర నీటితో కలపండి అంతే
  • లోపల ఇంకా బయట కూడా ఉపయోగించడానికి అనుకూలమైనది
  • 6 ఎమ్ఎమ్ల గ్రౌట్ వెడల్పుల వరకు కార్యసాధకమైనది
  • కుంగుదల-లేని, నీటి & యూవీ నిరోధక ఫలితాలను అందిస్తుంది
అనుప్రయోగాలు
  • 3-6 ఎమ్ఎమ్ల ఎడంగల సంధులకి సెరామిక్ ఇంకా ఇతర టైల్స్
  • సమతలమైన ఇంకా నిలువుగా ఉండే లోపలి ఇంకా బయటి ఉపరితాలాలపై ఉపయోగానికి
  • పొడిగా ఇంకా తడిగా ఉండే భాగాలకు

ఉపరితలాన్ని సిద్ధం చేయడం :
  • ఉపరితలాలు అన్నీ 40°F (4°C) ఇంకా 104°F (40°C) మధ్యన ఉండాలి. వాటి నిర్మాణం దృఢంగా ఉండి, అవి శుభ్రంగా, మురికి, చమురు, జిడ్డు, వదులుగా ఉండి పొరలు ఊడుతున్న పెయింట్, లెయిటెన్స్, కాంక్రీట్ సీలర్లు లేదా క్యూరింగ్ కాంపౌండ్స్ వంటివి ఏమీ లేకుండా ఉండాలి. ఉపరితలం నిటారుగా/ తిన్నగా ఉందో లేదో సీసంగుండుతో సరి చూడండి.
  • సీసంగుండుతో సరి చూస్తే స్ల్యాబులన్నీ 10 అ (3 మీ) లకి ¼” (6 ఎమ్ఎమ్) లోపల ఉండాలి. గరుకుగా లేదా అసమముగా ఉన్న కాంక్రీట్ ఉపరితలాలు, వుడ్ ఫ్లోట్ (లేదా మెరుగైన) ఫినిష్ చేకూర్చడానికి స్క్రీడ్/ ప్లాస్టర్ పదార్థంతో నున్నగా చేయబడాలి.
  • పొడిగా, దుమ్ము పట్టిన కాంక్రీట్ స్ల్యాబులను లేదా తాపీపని చేయబడిన ఉపరితలాలను తడిపి, ఎక్కువగా ఉన్న నీటిని ఊడ్చేయాలి.
  • తడి ఉపరితలం మీద ఇన్స్టాలేషన్ చేయవచ్చు. ఉపయోగించే ముందు కొత్త కాంక్రీట్ స్ల్యాబులు 28 రోజులవైనా అయ్యుండి, వాటిని నీటితో కూర్ చేసి ఉండాలి.
  • విస్తరించే సంధులకు అనుకూలమైన సీలెంట్ ని సమకూర్చి, వాటిని దానితో నింపాలి.
  • విస్తరించే సంధులని ధిన్ సెట్ టైల్ అఢీసివ్/టైల్స్ తో కప్పకండి.
ఉపయోగ విధానం:
పరిమితులు, హచ్చరికలు :
  • కఠోరమైన రసాయనిక పదార్థాలు, నిలవనీరు లేదా తీవ్రమైన స్థితులకు గురి అయ్యే భాగాలకు అనుకూలమైనది కాదు
  • వాటర్-ప్రూఫ్ కోటింగులకు ప్రత్యామ్నాయం కాదు; తడిగా ఉండే భాగాలలో టైలింగ్ చేసే ముందు సీప్ బ్లాకర్ వాటర్-ప్రూఫింగ్ వాడండి
  • సంధులని శుభ్రం చేసేందుకు యాసిడ్ వాడకండి
  • పూర్తిగా పొడిగా ఉన్న టైల్ సంధులలో మాత్రమే పూయండి
  • పాట్ లైఫ్ ని కొనసాగించేందుకు అతిగా కలపకండి
  • రంగు గల గ్రౌట్ తో మరకలు పడకుండా జాగ్రత్త పడండి
  • గట్టి పడక ముందే టైల్ మీద అంటుకున్న గ్రౌట్ ని శుభ్రం చేసేయండి
  • శుభ్రం చేస్తున్నప్పుడు నీటిని తరచుగా మార్చండి. శుభ్రం చేయడానికి వాడే బట్టకి లేదా స్పంజ్ కి గ్రౌట్ అంటుకుపోతే దాన్ని మార్చేయండి
  • పూసేటప్పుడు గ్రౌట్ చేయబడని సంధులలోకి నీరు పారకుండా అడ్డగించండి
  • కనీసం 24 గంటల వరకు ఆ భాగాన్ని నేరుగా పడే వర్షం నుంచీ, జనసంచారం నుంచీ కాపాడండి
  • న్యాచురల్ స్టోన్స్ విషయంలో, ముందు రంగు పీల్చుకుంటాయేమో పరీక్షించండి. మరకలు పడకుండా జాగ్రత్త పడటానికి, టైల్స్ ని గ్రౌటింగ్ చేసే ముందు టైల్స్ ని మరుగుపరచండి. సీలర్ గానీ, గ్రౌట్ రిలీజ్ గానీ కావలసి ఉండవచ్చు.
కవరేజ్ & గుణాలు
షెల్ఫ్ లైఫ్
నేరుగా ఎండ పడకుండా ఉన్న లోపలి స్థానంలో, చెమ్మ తగలని చోట, తీవ్రమైన శీతోష్ణస్థితుల నుంచి కాపాడి ఉంచితే సీల్ తో ఉన్న ప్యాక్ కి 12 నెలల పాటు ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

టైల్-లింక్ అనేది టైల్/స్టోన్ సంధులను నింపేందుకు సిమెంట్ ఆధారితమైన పదార్థం. ఇది లోపలి & బయటి ఫ్సోర్స్ ఇంకా వాల్ భాగాలకు ఉపయోగించబడుతుంది.

ఇది 6 ఎమ్ఎమ్ వెడల్పు గల సన్నమైన సంధులను నింపడానికి సిఫారసు చేయబడుతుంది కాబట్టి దీన్ని అన్- స్యాండెడ్ అంటారు.

టైల్-లింక్ 1కేజీ పౌచ్ లో లభిస్తుంది.

టైల్-లింక్ గ్రౌట్ ని మీరు రెసిడెన్షియల్, కమర్షియల్ ఇంకా ఇండస్ట్రియల్ ఫ్లోర్స్ ఇంకా గోడల వంటి లోపలి ఇంకా బయటి భాగాలలో సెరామిక్ / విట్రిఫైడ్ / గ్లాస్ మొజెయిక్ టైల్స్ ఇంకా సవరించబడిన మార్బుల్/క్వార్ట్జ్ స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ మొదలైనవాటికి ఉపయోగించవచ్చు.

ఉపయోగించేందుకు వివరమైన పద్ధతి కొరకు దయచేసి టైల్-లింక్ ఉత్పత్తి పత్రాన్ని చదవండి.

టైల్-లింక్ గ్రౌట్ ని ఉపయోగించేటప్పుడు ఈ కింద పేర్కొన్న ముందుజాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమైనవి, అతి ప్రధానమైనవి:
  • మురికి నీటితో కలపకండి. పౌడర్ తో కలపడానికి ఎప్పుడూ శుభ్రమైన తాగే నీరే వాడండి.
  • గ్రౌట్ ని మురికిగా ఉన్న తొట్టి లేదా బాల్చీలో కలపకండి. మేలైన ఫలితాలు పొందడానికి ఎప్పుడూ శుభ్రమైన తొట్టే వాడండి.
  • గ్రౌట్ ని ఉపయోగించేటప్పుడు ఉష్ణోగ్రత బాగా తక్కువగా (12 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా) ఉంటే, ఉష్ణోగ్రతని పెంచడానికి హీటర్లు వాడండి. ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా (35 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా) ఉంటే, మేలైన ఫలితాలు పొందడానికి చల్లని నీరు వాడండి లేదా సాయంత్రం / రాత్రి పూట / తెల్లవారుజామున పని చేయండి.
  • గ్రౌట్ ని పూయడానికి పుట్టీ బ్లేడ్లు వాడకండి: పుట్టీ బ్లేడ్లు లోహ పదార్థంతో చేసిన బ్లేడ్లు కాబట్టి వాటితో టైల్స్ మీద గీతలు పడతాయి. టైల్స్ మీద గీతలు పడకుండా ఉండేందుకు ఎప్పుడూ రబ్బర్ ఫ్లోట్స్ మాత్రమే వాడండి.
  • గ్రౌటింగ్ చేసే చోట గ్రౌట్ పూస్తున్నప్పుడు ప్లంబింగ్, ఎలెక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లాస్టరింగ్, టైలింగ్ లేదా పెయింటింగ్ వంటి ఇతర పనులు ఏమీ చేయనివ్వకండి. గాలిలో ధూళి ఉంటే, అది గ్రౌట్ చేయబడిన సంధులలో స్థిరపడుతుంది. తరవాత దాన్ని తొలగించడం చాలా కష్టం అవుతుంది. గ్రౌట్ పని చేస్తున్నవారిని తప్ప మరెవరినీ అక్కడ నుంచి వెళ్ళనివ్వకండి.
  • సంధులను నింపిన 30-45 నిమిషాల తరవాత మొదటి సారిగా ఒక తెల్ల స్పంజ్ తో శుభ్రం చేయడం మొదలుపెట్టండి. మొదటి సారి శుభ్రం చేసిన 24 గంటల తరవాత ఆఖరి సారి శుభ్రం చేయండి.
  • గ్రౌట్ సంధులని మొదటి సారీ, చివరి సారీ శుభ్రం చేసేందుకు ఎప్పుడూ తాగడానికి పనికొచ్చే శుభ్రమైన నీరే వాడండి.

గ్రౌట్ ని చివరి సారి శుభ్రం చేసిన 24 గంటల తరవాత జనసంచారాన్ని అనుమతించవచ్చు. భారీ రవాణాలను గ్రౌట్ సంధులని చివరి సారి శుభ్రం చేసిన 7 రోజుల తరవాత మాత్రమే పోనివ్వవచ్చు.

టైల్-లింక్ గ్రౌట్ తో నింపడానికి సంధు కనీస వెడల్పు 1 మిమీ ఉండాలి, సంధు అధికతమ పరిమాణము (వెడల్పు) 6 మిమీ ఉండాలి.

దిని ప్రయోజనాలు ఏమిటంటే, ఇది మరకలని నిరోధిస్తుంది, మెత్తనైనది ఇంకా పూయడానికి సులువైనదే కాక, చాలా తక్కువ ఖరీదైనది. అంతే కాక, ఇది కాలం దాటాక కూడా బీటలు వేయదు, పిండి అవ్వదు, గుండయ్యి చెదిరిపోదు. దీన్ని బయటి ఫసాడ్స్, ఆరుబయటి డాబాలు, లోపలి గోడలు ఇంకా ఫ్లోర్స్ మీద నిరపాయముగా ఉపయోగించవచ్చు.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
tilelynk-tile-grout