ఇది సెరామిక్, సెమీ-విట్రియస్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్ ఇంకా చిన్న నుంచి మీడియమ్ ఫార్మ్యాట్ గల న్యాచురల్ స్టోన్స్ ని కూర్చడానికి పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్. ఇది 3 మీటర్ల ఎత్తు వరకు, లోపలి సమతలమైన ఇంకా నిలువుగా ఉండే ఉపరితలాలకు సిమెంట్ మిశ్రత అడుగుతట్టులపై పొడిగా ఇంకా తడిగా ఉండే భాగాలలో ఉపయోగించడానికి అనుకూలమైనది. ఇది టైల్-పై-టైల్ ఉపయోగాలకు కూడా సిఫారసు చేయబడుతుంది.
గ్యాలరీ
స్థిరమైన టైల్ అఢీషన్
హెచ్చించబడిన టైల్ మన్నిక
హెచ్చైన శక్తిగల అఢీసివ్
దృఢమైన టైల్ బంధనం
వ్యావసాయిక తరగతి బంధనం
వేడుకైన ఫినిషింగ్
ప్రొడక్ట్ హైలైట్స్
ఫీచర్లు మరియు ప్రయోజనాలు
ఉపయోగించేందుకు సులువైనది - నీటితో కలపండి అంతే.
అనేక రకాల అడుగుతట్టులకు బలంగా అంటుకొని ఉండేందుకు హెచ్చుగా పాలిమర్-మాడిఫైడ్
నీటినీ, అదురు దెబ్బలనీ నిరోధిస్తుంది - తడిగా ఉండే భాగాలకూ, కమర్షియల్ ఫ్లోర్స్ కీ శ్రేష్ఠమైనది
నిలువు గోడలకు కిందకి దిగనివ్వని ఫార్ములా.
తక్కువ వీఓసీ ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడుతుంది.
అనుప్రయోగాలు
<3% సఛిద్రతగల సెరామిక్ ఇంకా ఇతర టైల్స్ కి
పొడిగా ఇంకా తడిగా ఉండే భాగాలకు
సమతలమైన ఇంకా నిలువుగా ఉండే లోపలి ఉపరితాలాలపై
టైల్-పై-టైల్ ఉపయోగాలకు
విట్రిఫైడ్ టైల్స్, పోర్సలీన్ టైల్స్ ఇంకా సెరామిక్ టైల్స్ కి
మీడియమ్ ఫార్మ్యాట్ టైల్స్ కి
అడుగుతట్టు
సిమెంట్-ఆధారిత స్క్రీడ్స్ ఇంకా మొర్టార్స్
జిప్సమ్ ఇంకా సిమెంట్-ఆధారిత ప్లాస్టర్స్/రెండర్స్
కాంక్రీట్ ఉపరితలాలు
ఇటికెల తాపీపని
ఏఏసీ బ్లాక్స్
వాటర్-ప్రూఫింగ్ ఉత్పత్తులు
సిమెంట్ టెర్రాజో
స్థితమైన విట్రిఫైడ్ టైల్స్ ఇంకా సెరామిక్ టైల్స్
స్థితమైన న్యాచురల్ స్టోన్స్
ఇంకొక సిమెంట్-ఆధారిత ఉపరితలం
ఉపరితలాన్ని సిద్ధం చేయడం :
ఉపరితలాలు అన్నీ 40°F (4°C) ఇంకా 104°F (40°C) మధ్యన ఉండాలి. వాటి నిర్మాణం దృఢంగా ఉండి, అవి శుభ్రంగా, మురికి, చమురు, జిడ్డు, వదులుగా ఉండి పొరలు ఊడుతున్న పెయింట్, లెయిటెన్స్, కాంక్రీట్ సీలర్లు లేదా క్యూరింగ్ కాంపౌండ్స్ వంటివి ఏమీ లేకుండా ఉండాలి. ఉపరితలం నిటారుగా/తిన్నగా ఉందో లేదో సీసంగుండుతో సరి చూడండి.
సీసంగుండుతో సరి చూస్తే స్ల్యాబులన్నీ 10 అ (3 మీ) లకి ¼” (6 ఎమ్ఎమ్) లోపల ఉండాలి. గరుకుగా లేదా అసమముగా ఉన్న కాంక్రీట్ ఉపరితలాలు, వుడ్ ఫ్లోట్ (లేదా మెరుగైన) ఫినిష్ చేకూర్చడానికి స్క్రీడ్/ ప్లాస్టర్ పదార్థంతో నున్నగా చేయబడాలి.
పొడిగా, దుమ్ము పట్టిన కాంక్రీట్ స్ల్యాబులను లేదా తాపీపని చేయబడిన ఉపరితలాలను తడిపి, ఎక్కువగా ఉన్న నీటిని ఊడ్చేయాలి.
తడి ఉపరితలం మీద ఇన్స్టాలేషన్ చేయవచ్చు. ఉపయోగించే ముందు కొత్త కాంక్రీట్ స్ల్యాబులు 28 రోజులవైనా అయ్యుండి, వాటిని నీటితో కూర్ చేసి ఉండాలి.
విస్తరించే సంధులకు అనుకూలమైన సీలెంట్ ని సమకూర్చి, వాటిని దానితో నింపాలి.
విస్తరించే సంధులని ధిన్ సెట్ టైల్ అఢీసివ్/టైల్స్ తో కప్పకండి.
ఉపయోగ విధానం:
కవరేజ్:
6 ఎమ్ఎమ్ x 6 ఎమ్ఎమ్ ల చదరమైన నాట్ల తాపీతో 3 ఎమ్ఎమ్ ల మందంలో 20 కేజీల సంచికి సుమారుగా 55-60 ft2. *కవరేజ్ తాపీ నాట్ల సైజ్, టైల్ రకం ఇంకా సైజ్ తో పాటూ అడుగుతట్టు నున్నదనం ఇంకా సమత్వంపై ఆధారపడి వేరు వేరుగా ఉంటుంది
గ్రౌటింగ్
టైలింగ్ చేసిన 24 గంటల తరవాత గ్రౌటింగ్ చెయ్యాలి. బిర్లా వైట్ వారి టైల్ గ్రౌట్ల శ్రేణి నుంచి సముచితమైన గ్రౌటింగ్ సామగ్రి వాడండి.
గుణాలు
షెల్ఫ్ లైఫ్
నేరుగా ఎండ పడకుండా ఉన్న లోపలి స్థానంలో, చెమ్మ తగలని చోట, తీవ్రమైన శీతోష్ణస్థితుల
నుంచి కాపాడి ఉంచితే సీల్ తో ఉన్న ప్యాక్ కి 12 నెలల పాటు ఉంటుంది.
టైల్స్ వివిధమైన రకాలలో, సైజులలో, వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. సర్వోత్తమైన బంధనానికి ప్రతి దానికీ నిర్ణీతమైన అఢీసివ్ గుణాలు కావలసి ఉంటాయి కాబట్టి ఒక ఉపయోగానికి ప్రత్యేకమైన టైల్ అఢీసివ్ ఏదీ లేదు. నిశ్చింతగా ఉండండి, టైల్స్ ని ఎక్కడైనా అమర్చడానికి బిర్లా వైట్, వారి వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్ తో అత్యుత్తమమైన టైల్ అఢీసివ్స్ ని ప్రవేశపెట్టారు.
బిర్లా వైట్ అత్యాధునిక టెక్నాలజీ ఇంకా జర్మన్ మాడిఫైడ్ పాలిమర్ టెక్నాలజీ ని ఉపయోగిస్తారు. అవి, అడుగుతట్టుతో బలమైన బంధనంతో పాటూ గోడలకీ, ఫ్లోర్స్ కీ ఎక్కువ కాలం నిలిచే నీటైన తీరుని ఇచ్చే వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్ తో, వర్గానికి అత్యుత్తమమైన ఇంకా పరిశ్రమలో విశిష్టమైన టైల్ అఢీసివ్స్ ని అందిస్తాయి.
అవును, టైల్స్ ని అమర్చడానికి బిర్లా వైట్ టైల్-స్టిక్స్ టైల్ అఢీసివ్ సిమెంట్ కన్నా మేలైన ఎంపిక. టైల్ అఢీసివ్స్ కి నిర్ణీతమైన గుణాలు ఉంటాయి. అవి మెరుగైన బంధనం, వశ్యత ఇంకా టైల్ స్థాపనకి పెట్టిన టైల్ ని బంధించి ఉంచే నిరోధక శక్తిని అందిస్తాయి. సాంప్రదాయక సిమెంట్ మోర్టార్ తో పోలిస్తే బిర్లా వైట్ టైల్-స్టిక్స్ టైల్ అఢీసివ్స్ సులువైన పని సామర్థ్యాన్ని నిశ్చితపరచి, సమమైన ఫలితాలను అందిస్తాయి.
ఉపయోగించవచ్చు. టైల్-స్టిక్స్ విట్రిబైండ్ ని పోర్సలీన్ టైల్స్ ఇంకా సెమీ- విట్రిఫైడ్ టైల్స్ కి టైల్-పై-టైల్ ప్రయోగానికి వాడవచ్చు.
టైల్-స్టిక్స్ విట్రిబైండ్ అనేది ఒక పాలిమర్ ఆధారిత అఢీసివ్. దీన్ని నీటితో కలిపి లోపలి ఫ్లోర్స్ ఇంకా గోడలకి విట్రిఫైడ్ టైల్స్, పోర్సలీన్ టైల్స్, సెరామిక్ టైల్స్, ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని 3 మీటర్ల ఎత్తు వరకు అమర్చడానికి వాడతారు.
మీరు టైల్-స్టిక్స్ విట్రిబైండ్ ని లోపలి ఫ్లోర్స్ ఇంకా గోడలకి, అలాగే నివాస స్థానాల ఫ్లోర్స్ ఇంకా గోడల వంటి బయటి భాగాలలో 600 ఎమ్ఎమ్ X 600 ఎమ్ఎమ్ సైజ్ వరకు ఉన్న విట్రిఫైడ్ టైల్స్ / పోర్సలీన్ టైల్స్ / సెరామిక్ టైల్స్ లేదా మీడియమ్ ఫార్మ్యాట్ టైల్స్ ని అమర్చడానికి ఉపయోగించవచ్చు
20 కేజీల టైల్-స్టిక్స్ విట్రిబైండ్ సంచికి, 5.2 నుంచి 5.6 లీటర్ల నీరు కావలసి ఉంటుంది. అవసరమైన మిశ్రమం చిక్కదనాన్ని ఇంకా చుట్టూ ఉన్న పరిసరాల స్థితులను బట్టి నీరు కలపండి.
నీరు కలిపిన టైల్-స్టిక్స్ విట్రిబైండ్ తో అమర్చబడగల అత్యధిక సెరామిక్ / విట్రిఫైడ్ టైల్ సైజ్ 600ఎమ్ఎమ్ X 600ఎమ్ఎమ్. ఒక వేళ మీరు ఈ సైజ్ కన్నా పెద్ద టైల్స్ పెడుతున్నట్టు అయితే, బిర్లా వైట్ టీమ్ సభ్యుడిని అందుకు తగిన అఢీసివ్ సిఫారసు చేయమని అడగండి.
ఆరుబయట టైల్స్ ని అమర్చడానికి, ఉష్ణతాత్మక ఒత్తిడులు అతిప్రధానమైనవి. వాటికి ఆ ఒత్తిడుల వల్ల కలిగే కదలికలను సర్దిపుచ్చడానికి అఢీసివ్ కావలసి ఉంటుంది. ఆరుబయటి ఉపరితలాల మీద టైల్స్ ని అమర్చడానికి, టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో ని ఉపయోగించండి.
మీరు టైల్-స్టిక్స్ విట్రిబైండ్ లేదా అంతకు మించిన వాటితో న్యాచురల్ స్టోన్స్ ని అమర్చదల్చినప్పుడు బిర్లా వైట్ టీమ్ సభ్యుడిని సలహా అడగండి.
మీరు టైల్స్ పెట్టడానికి టైల్-స్టిక్స్ విట్రిబైండ్ ని ఉపయోగించదలిస్తే, అత్యధికంగా 3 మీటర్లు / 10 అడుగుల ఎత్తు వరకు అమర్చవచ్చు. 3 మీటర్లు / 10 అడుగుల ఎత్తు కన్నా పై వరకు టైల్స్ అమర్చదల్చినప్పుడు, దయచేసి బిర్లా వైట్ టీమ్ సభ్యుడిని సలహా అడగండి.
If the engineered stones / Agglomerates / Quartz stones have to be installed on floors, you can’t use
TileStix Vitribind. Contact Birla White Team member for seeking adviceఇంజినీర్డ్ స్టోన్స్ /యాగ్లోమరేట్స్/ క్వార్ట్జ్ స్టోన్స్ ని ఫ్లోర్స్ మీద అమర్చాలంటే, మీరు టైల్-స్టిక్స్ విట్రిబైండ్ ని ఉపయోగించకూడదు. సలహా అడగటానికి బిర్లా వైట్ టీమ్ సభ్యుడితో సంప్రదించండి.