ఎక్స్‌టోకేర్ ప్రైమర్

బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్ 7x * అతుక్కునే స్వభావంతో వస్తుంది కాబట్టి మీ గోడల నుండి పెయింట్ పెచ్చులు రాలిపోదు!

ఎక్స్‌టోకేర్ ప్రైమర్

బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్ 7x * అతుక్కునే స్వభావంతో వస్తుంది కాబట్టి మీ గోడల నుండి పెయింట్ పెచ్చులు రాలిపోదు!
అవలోకనం
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ వైట్ సిమెంట్‌ ఆధారిత, పాలిమర్-మాడిఫైడ్, బాహ్య గోడల ప్రైమర్, ఇది మార్కెట్లో లభించే ఏదైనా యాక్రిలిక్ వాల్ ప్రైమర్ కంటే 7x * ఎక్కువగా అతుక్కునే స్వభావాన్ని అందిస్తుంది. ఇది మీ గోడ టాప్ కోటింగ్ పెచ్చులు ఊడిపోకుండా నిరోధిస్తుంది, రాబోయే సంవత్సరాల్లో మీ గోడల్ని రక్షిస్తుంది. రక్షణతో కూడిన అదనపు పొరను జోడించడంతో పాటు, ఈ ఉత్పత్తి గోడ టాప్ కోటింగ్‌ యొక్క నిజమైన టోన్‌లను బయటకు తీసుకురావడానికి అవసరమైన ఒపాసిటీ మరియు తెల్లదనాన్ని ఇస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
టాప్ కోట్కి అత్యుత్తమంగా అతుక్కుంటుంది.
టాప్ కోట్ పెచ్చులూడటాన్ని నిరోధిస్తుంది
అత్యుత్తమ అపారదర్శకత మరియు తెల్లదనం
కోసుకుపోవడం నుంచి ఆర్సిసి నిర్మాణాన్ని రక్షిస్తుంది
లక్షణాలు
 • బెస్ట్ ఇన్ క్లాస్ ఒపాసిటీ మరియు తెల్లదనం కలిగి ఉంటుంది
 • యాంటీ కార్బొనేషన్ లక్షణాలను కలిగి ఉంది
 • ఇతర ప్రైమర్‌ల కంటే టాప్ కోటింగ్‌‌కు 7x * ఎక్కువగా అతుక్కునే స్వభావాన్ని ఇస్తుంది
 • VOC (అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు) లేవు
 • యాంటీ ఆల్కలైన్
 • పర్యావరణానికి స్నేహపూరితమైనది
 • అత్యంత మన్నికైనది
ప్రయోజనాలు
 • తుప్పు నుండి RCC నిర్మాణాన్ని రక్షిస్తుంది
 • టాప్ కోటింగ్‌ ఊడిపోకుండా నిరోధిస్తుంది
 • ఉపయోగించడం చాలా సులభం
 • ఎత్తైన ప్రదేశంలో ఉపయోగించడానికి ప్రయోజనకరమైనది
 • తడిగా/ తేమగా ఉండే ఉపరితలాలపై ఉపయోగించవచ్చు
 • UV మరియు వాతావరణ ప్రభావాలను నిరోధిస్తుంది
అప్లికేషన్‌లు
 • బాహ్య గోడలు
 • RCC నిర్మాణాలు/ప్లాస్టర్ ఉపరితలాలు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

టెక్నికల్ స్పెసిఫికేషన్:
Sr.No టెక్నికల్ పరామీటర్ స్పెసిఫికేషన్లు టెక్నికల్ రేంజ్
1 *కవరేజీ ( చదరపుమీటరు/కిగ్రా/ఒకకోటింగ్) [ఆదర్శవంతంగామృదువుగాఉన్నఉపరితలంపై] 7.90-9.75 ఇంటిలో
2 పాట్లైఫ్ (గంటలు) 3.0-3.5 ఇంటిలో
3 ఎండేసమయం @ 25±2 ºC
-టచ్డ్రై
-హార్డ్డ్రై
గరిష్టంగా 1 గంట.
కనీసం 6 గంటలు.
ఇంటిలో
ఇంటిలో
4 VOC (g/kg) నిల్ ASTM 6886
5 బల్క్డెన్సిటీ (g/cm3) 0.80-0.90 ఇంటిలో
* ఈవిలువమృదువైనఉపరితలంపైనది; అయితేఉపరితలటెక్చర్నిబట్టిఇదిమారవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
మీ గోడలను పెయింటింగ్ చేయడానికి ముందు, వాటిని సిద్ధం చేయడం ఎంతో కీలకం, తద్వారా మీ పెయింట్ ఎక్కువకాలం ఉంటుంది. వాల్ ప్రైమర్ పెయింట్ మరియు ఉపరితలానికి మధ్య అతుక్కునేలా సహాయపడుతుంది. పెయింట్ మన్నికను పెంచుతుంది, అలానే పెయింట్ చేసిన తర్వాత కూడా ఉపరితలాన్ని రక్షిస్తుంది. వాల్ ప్రైమర్లు గోడ ఉపరితలంపై ఉండే రంధ్రాలు మరియు పగుళ్లను కవర్ చేస్తాయి. తద్వారా, పెచ్చులు రాలడం, పసుపుపచ్చగా మారడం, ఊడిపోవడం మరియు పెయింట్ ఉబ్బడం వంటి వాటి నుంచి ఉపరితలాలకు నిరోధాన్ని అందిస్తాయి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ వైట్ సిమెంట్‌ ఆధారిత, పాలిమర్-మాడిఫై చేయబడ్డ, నీటి పలచదనం కలిగిన అండర్‌కోట్ వాల్ ప్రైమర్, దీనిని పెయింటింగ్‌కి ముందు బాహ్య గోడలపై ఉపయోగిస్తారు.
నీటి ద్వారా పలచగా మార్చే ఉత్పత్తి కావడం వల్ల, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌ని తడిగా/తేమగా ఉండే ఉపరితలాలపై ఉపయోగించవచ్చు. మార్కెట్‌లోని ఇతర వాల్ ప్రైమర్‌లతో పోలిస్తే దీనిని ఉపయోగించడం తేలిక. సిమెంట్-ప్లాస్టర్డ్/ఆర్‌సిసి ఉపరితలాలపై నేరుగా ఉపయోగించడానికి అనువైనది. అంతేకాక, ఇతర ప్రైమర్‌లతో పోలిస్తే ఇది మరింత ఖర్చు తక్కువైనది. ఇది మీ గోడకు 7X * రెట్లు ఎక్కువగా అతుక్కునే లక్షణాన్ని అందిస్తుంది, పెయింట్ ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.
యాక్రిలిక్ ప్రైమర్‌కు విరుద్ధంగా, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌కు అప్లై చేసిన తరువాత క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలానే తేలికగా అప్లై చేయవచ్చు. ఇది ఎత్తైన గోడలపై బాగా పనిచేస్తుంది, బెస్ట్-ఇన్-క్లాస్ తెల్లదనం అధిక ఒపాసిటీని ఇస్తుంది. ప్రైమర్ మార్కెట్‌లోని ఏ ఇతర ప్రైమర్ కన్నా టాప్‌కోట్‌కు 7x * ఎక్కువ అతుక్కునేలా చేస్తుంది, తద్వారా టాప్‌కోట్ పెచ్చులు ఊడిపోకుండా నివారిస్తుంది. చివరగా, ఇది RCC స్ట్రక్చర్‌కు తుప్పుపట్టకుండా సంరక్షిస్తుంది, దీని మెరుగైన లక్షణాలను ప్రధానమైన నేషనలైజ్డ్ లేబరేటరీలు ధృవీకరించాయి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్‌ను ఉపయోగించడానికి ముందు గోడను సిద్ధం చేయడానికి, మీరు దాని ఉపరితలంపై దుమ్ము,ధూళి, నూనె మొదలైన వాటితో పాటు వదులుగా ఉండే అన్ని ఎడిసివ్‌లను తొలగించాలి. దీని కోసం, మీరు శాండ్‌పేపర్, బ్లేడ్ లేదా వైర్ బ్రష్‌ ఉపయోగించవచ్చు. పెయింట్ చేయడానికి ముందు, ఉపరితలాన్ని 180 లేదా 220 ఎమిరీ పేపర్‌తో రుద్దాలి, తద్వారా అది మృదువుగా మారుతుంది.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ కోసం సిఫార్సు చేయబడిన మిక్సింగ్ నిష్పత్తి 1 కిలో ప్రొడక్ట్‌కు 1100 మిల్లీ లీటర్ల నీటిని ఉపయోగించాలి.
ముద్దగా చేయడానికి, మెకానికల్ స్టిరర్ ఉపయోగించి 5 నిమిషాలపాటు కలపాలి. మెషిన్‌లు లేకుండా చేస్తే, దీనిని సుమారు 10-12 నిమిషాలపాటు కలపాలి. తుది మిశ్రమంలో ఎలాంటి ముద్దలు లేకుండా చూసుకోవాలి. మీరు మిశ్రమాన్ని తయారు చేసిన తరువాత, పాలిమర్‌లు మెరుగ్గా విఘటనం చెందడానికి దానిని 5 నిమిషాలపాటు విడిచిపెట్టండి. మీరు దీన్ని 3-3.5 గంటల్లోపు ఉపయోగించేలా చూడండి.
మీరు మిశ్రమాన్ని పూర్తిగా కలిపిన తర్వాత, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ కోటును ఉపరితలంపై ఏకరీతిగా కోటింగ్ చేయండి. మీరు దీనిని పెయింటింగ్ బ్రష్ (0.1016 లేదా 0.127 మీటరు) లేదా రోలర్ సహాయంతో చేయవచ్చు. మీరు టాప్‌కోట్‌కు వేయడానికి ముందు బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ మొదటి కోటింగ్ కనీసం 2-3 గంటలపాటు ఆరనివ్వండి.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ ప్రైమర్‌ ఉపయోగించేటప్పుడు, మీరు ముందుగా గోడ ఉపరితలం బాగా తడిసినట్లు నిర్ధారించుకోవాలి. మిక్సింగ్ నిష్పత్తి ప్రకారం మిశ్రమాన్ని తయారు చేయాలి, దీనిని తయారీ చేసి 3-3.5 గంటల్లోపు వాడాలి. ఉపయోగించే సమయంలో ఉపరితలం తేమగా ఉండాలి, టాప్ కోటింగ్ వేయకుండా ఎక్కువ కాలం ఉంచకూడదు. మీ రక్షణ కొరకు భద్రతా గాగుల్స్ & తగిన నోస్ మాస్క్‌లు ధరించేలా చూసుకోండి. చివరగా, ఈ ఉత్పత్తిని చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి, అలానే పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలి.
లేదు, గోడల్లో ఉండే తేమని ముందుగా క్యూర్ చేయడం ముఖ్యం. మీరు గోడలకు రీపెయింట్ చేయడానికి ముందు తేమ లేకుండా కెమికల్ జాబ్స్ చేసే నిపుణుల సాయం తీసుకోవాలని మేం సిఫారసు చేస్తున్నాం. ఈ విధంగా, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ 10 కిలోల బక్కెట్ ప్యాక్‌లోనూ, 1 కిలో మరియు 5 కిలోల సెకండరీ ప్యాక్‌ల్లో లభిస్తుంది.
బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ గ్రీన్‌ప్రో స్టాండర్డ్ మరియు క్వాలిటీ ఆవశ్యకతలను కలిగి ఉండి గ్రీన్‌ప్రో సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తుంది
VOC(అస్థిర సేంద్రీయ కంటెంట్)లు అస్థిరమైన, కార్బన్ ఉండే సమ్మేళనాలు. ఇవి వాయు కాలుష్యానికి కారణమవుతాయి, అలానే శ్వాస సమస్యలు, తలనొప్పి, చర్మం మండటం, కళ్ల నుంచి నీరు కారడం మరియు వికారం వంటి ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. కొన్ని VOCలు క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు మరియు కాలేయ దెబ్బతినడానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల, వాటిని చుట్టూ ఉండే కనస్ట్రక్షన్ మెటీరియల్‌ల్లో VOC లేకుండా ఉండాలని సిఫారసు చేయబడుతుంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ ఎక్స్‌టోకేర్ని ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు. ఇండియామార్ట్‌లో మీరు మా ప్రొడక్ట్ క్యాటలాగ్ చూడవచ్చు.
బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
రుజువులు