కార్పొరేట్ సామాజిక బాధ్యత
యువతను మేల్కొల్పడమే ఎదుగుదలకు కీలకం. ఈ అభివృద్ధికి మరింత పెంపొందించేందుకు మరియు సమాజానికి తిరిగి ఇవ్వడానికి, మేం కొన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కలిగిన కార్యక్రమాలతో ముందుకు వచ్చాం. వీటి గురించితెలుసుకోవడానికి కిందకు స్క్రోల్ చేయండి!

Loading

కార్పొరేట్ సామాజిక బాధ్యత
యువతను మేల్కొల్పడమే ఎదుగుదలకు కీలకం. ఈ అభివృద్ధికి మరింత పెంపొందించేందుకు మరియు సమాజానికి తిరిగి ఇవ్వడానికి, మేం కొన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కలిగిన కార్యక్రమాలతో ముందుకు వచ్చాం. వీటి గురించితెలుసుకోవడానికి కిందకు స్క్రోల్ చేయండి!
అవలోకనం
ప్రపంచంలోని టాప్ 10 వైట్ సిమెంట్ కంపెనీల్లో బిర్లా వైట్ స్థానాన్ని సంపాదించింది. అనేక సంవత్సరాలుగా, మేం విలువాధారిత ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టాం, అలానే ప్రీమియం వైట్ సిమెంట్ కంపెనీగా మా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాం.

మా విస్తరణ ప్రయాణంలో మాకు విజయంతోపాటు రివార్డులు కూడా దక్కాయి. అందువల్ల మా సిఎస్‌ఆర్ కార్యక్రమాల సంఖ్యను పెంచడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని మేం నిర్ణయంచున్నాం. మేం వివిధ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవల్ని ప్రారంభించాం. వీటిలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళా సాధికారత, మైక్రోఫైనాన్స్, స్థిరమైన జీవనోపాధి, పశువుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలున్నాయి.
విజన్
"‘ేం పనిచేసే సమాజంలోని సామాజిక, ఆర్థికాభివృద్ధికి మరింత చురుగ్గా సహకరించడం. ఈ విధంగా చేయడం ద్వారా, దేశంలోని మానవ సూచికను పెంచుతూ, సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ఒక స్థిరమైన, మెరుగైన జీవన విధానాన్ని నిర్మించాలని మేం ఆశిస్తున్నాము."
- శ్రీమతి రాజశ్రీ బిర్లా, చైర్‌పర్సన్ - ఆదిత్య బిర్లా సెంటర్ సామాజిక ప్రోత్సాహక కార్యక్రమాలు మరియు గ్రామీణాభివృద్ధి
కీలకంగా దృష్టి సారించే ప్రాంతం
Health care

ఆరోగ్య సంరక్షణ

విద్య

విద్య

స్థిరమైన జీవనోపాధి

స్థిరమైన జీవనోపాధి

మౌలిక సదుపాయాల అభివృద్ధి

మౌలిక సదుపాయాల అభివృద్ధి

సామాజిక సంక్షేమం

సామాజిక సంక్షేమం

Health care

ఆరోగ్య సంరక్షణ

ఏదైనా దేశం HLM (మానవాభివృద్ధి సూచిక) వృద్ధిని ప్రభావితం చేసే ముఖ్య సూచికల్లో ఆరోగ్యం ఒకటి. ఇప్పటీ, భారతదేశ మొత్తం జనాభాలో 68% పైగా గ్రామీణ భారతదేశం నివసిస్తోంది, అందులో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు మెరుగైన వైద్య సంరక్షణను సులభంగా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వారు సంక్రామ్యక వ్యాధుల నుంచి సంక్రామ్యేత వ్యాధుల వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. వీటిలో కొన్ని మలేరియా, డయాబెటిస్, ఫ్లూ మరియు మొదలైనవి. గ్రామీణ భారతదేశంలో ప్రసవానంతర ప్రసూతి అనారోగ్యం అనేది మరో తీవ్రమైన సమస్య, దీని వల్ల తల్లుల మరణాలు చోటు చేసుకుంటాయి.

చాలా ఈ సమస్యలు చదువు, వనరుల కొరత కారణంగా వరకు తలెత్తుతాయి. అందువల్ల, సమాజంలో ఈ అంతరాలు తగ్గించడానికి, మేం గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే కార్యక్రమాలను ప్రారంభించాం. వీటితో, పిల్లల మరణాల సంఖ్యను తగ్గించడం, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మలేరియా, మధుమేహం, హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి వ్యాధులను ఎదుర్కోవడం వంటి మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ (WHO) సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.
Education

విద్య

ప్రపంచంలో అత్యధిక యువత జనాభా భారతదేశంలో ఉంది. మన దేశ భవిష్యత్తు వారి భుజస్కందాలపై ఉంది, అందువల్ల వారు నాణ్యమైన విద్యను పొందడం ఎంతో ముఖ్యం. భారతదేశ యువతలో అధికశాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే, అక్కడ వారు విద్యను పొందడం ఒక సవాలుతో కూడుకున్న అంశం.

మా CSR కార్యక్రమాల ద్వారా, మేం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి, స్వయంసాధికారత సాధించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేం ఉపకారవేతనాలు అందిస్తున్నాం, చదువుల్లో కనపరిచే ప్రతిభను గుర్తిస్తుంది, టాలెంట్‌ని అభివృద్ధి చేస్తున్నాం, వివిధరకాలైన కార్యకలాపాలు మరియు వర్క్‌షాప్‌లను మొదలైనవి నిర్వహిస్తున్నాం. వారు వివిధ రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, విద్యార్థులు వివిధ రకాలైన విద్యా నైపుణ్యాలు పొందేందుకు స్ఫూర్తిని అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.
Sustainable Livelihood

స్థిరమైన జీవనోపాధి

మెరుగైన జీవన ప్రమాణాలకు స్థిరమైన జీవనోపాధి ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకున్నాం. మా గ్రామీణ CSR కార్యక్రమాల ద్వారా ప్రజల్లోని విభిన్న సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, ఉపయోగించడానికి మేం ప్రయత్నిస్తాం, తద్వారా స్వయంసమృద్ధిని సాధించవచ్చు.

మహిళా స్వయం సహాయక బృందాలు, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీ కోర్సులు, మోటారు రివైండింగ్ కార్యక్రమాలు మరియు టైలరింగ్ కేంద్రాలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా, అనేక మంది వ్యక్తులు వారి లక్ష్యాలను అర్ధం చేసుకొని వాటిని సాధించడానికి మరియు జీవనోపాధిని సంపాదించుకోవడానికి మేం సాయం చేస్తున్నాం.
Infrastructure Development

మౌలిక సదుపాయాల అభివృద్ధి

మేం వివిధ ప్రాంతాల్లో మా ప్రణాళికలకు దగ్గరగా ఉండే CSR కార్యక్రమాలను ప్రారంభించాం. ఇది మెరుగైన, మరింత స్థిరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు దారితీసింది. దీనితో పాటు, ఆయా ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరియు సాధారణ జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడింది.

ఖరియా ఖంగర్‌లో రోడ్ల నిర్మాణం, ధనప్ప వద్ద కమ్యూనిటీ సెంటర్ పునరుద్ధరణ, మెరాసియాలో డ్రైనేజీ వ్యవస్థను సృష్టించడం మొదలైనవి వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మా చర్యల ద్వారా మరిన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు చేయడం కొనసాగించడం ద్వారా మరింత మంది ప్రజలకు సాయం చేయాలని మేం ఆశిస్తున్నాం.
Social Welfare

సామాజిక సంక్షేమం

సమాజం మాపై ఉన్న నమ్మకం కారణంగానే బిర్లా వైట్‌కు చిరపరిచితమైన పేరుప్రఖ్యాతులున్నాయి. అందువల్లనే మేం సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా, వారి జీవితాలను సుసంపన్నం చేయాలని ఆశిస్తున్నాం.

మా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేం ఆరోగ్య సంరక్షణ సమస్యలు, విద్యా సమస్యల్ని పరిష్కరిస్తాం, మన చుట్టూ ఉన్నవారి మొత్తం జీవితాలను సుసంపన్నం చేయడంపై దృష్టి పెడతాం. మేం సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం, అలానే అవసరమైన వారికి అత్యావశ్యక వస్తువులను అందిస్తాం, ఆధార్ కార్డు క్యాంప్‌లు నిర్వహిస్తాం, మరియు ప్లానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తాం, మా చర్యల ద్వారా మేం సమాజాభివృద్ధికి దోహదపడతామని మేం ఆశిస్తున్నాం.
కవర్ చేసే భౌగోళిక ప్రాంతం
కవర్ చేస్తున్న ప్రాంతాలు: రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ మరియు నాగౌర్ జిల్లాల్లో భోపాల్‌ఘర్ మరియు మెర్టా బ్లాక్‌లు
కవర్ చేసే భౌగోళిక ప్రాంతం